![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -355 లో... ఇంట్లో అందరిని పిలుస్తాడు రామరాజు. అమూల్యకి పెళ్లి సంబంధం చూస్తున్నాను.. త్వరలోనే పెళ్లి అని చెప్తాడు. ఇప్పుడే పెళ్లి ఏంటని నర్మద అడుగుతుంది. మీకు నా నిర్ణయం చెప్పడానికి మాత్రమే పిలిచాను.. మీరు ఏం అనుకుంటున్నారని అడగడానికి కాదని రామరాజు అంటాడు.
ఆ తర్వాత ధీరజ్ దగ్గరకి ప్రేమ వచ్చి.. మీ నాన్న తీసుకున్న నిర్ణయం సరైంది కాదు.. మీరందరు వద్దని చెప్పొచ్చు కదా అంటుంది. దాంతో నోరు ముయ్.. నీ ఉద్దేశ్యం ఏంటో క్లియర్ గా తెలుస్తుందని ప్రేమపై ధీరజ్ చెయ్యి ఎత్తుతాడు. మా నాన్న నిర్ణయానికి అడ్డుచెప్పను. తన నిర్ణయం సరైందని ధీరజ్ అంటాడు. ఇంకొకటి నువ్వు నాతో ఇక మాట్లాడకని ప్రేమకి ధీరజ్ చెప్తాడు.
మరొకవైపు శ్రీవల్లి హ్యాపీగా తన పుట్టింటికి వస్తుంది. ఆ అమూల్యకి పెళ్లి చేస్తారట.. ఇక ఆ విశ్వగాడితో మనకేం సంబంధం ఉండదు. వాడు వస్తే మాకేం తెలియదని చెప్పండని శ్రీవల్లి తన పేరెంట్స్ కి చెప్తుంది. అదంతా విశ్వ వచ్చి వింటాడు. అమూల్య పెళ్లి మీరే క్యాన్సిల్ చెయ్యాలి, లేదంటే అసలు అమూల్యని నాతో ప్రేమలో పడేలా నువ్వే చేసావని అందరికి చెప్తానని తనని విశ్వ బ్లాక్ మెయిల్ చెయ్యగానే శ్రీవల్లి భయపడుతుంది.
మరొకవైపు కిచెన్ లో ఉన్న వేదవతి దగ్గరికి ప్రేమ వెళ్లి ఇప్పుడే అమూల్యకి పెళ్లి ఏంటని అడుగుతుంది. నువ్వు నాకు ఏం చెప్పకని ప్రేమని తిట్టి పంపిస్తుంది వేదవతి. ప్రేమ ఏడుస్తూ బయటకు వస్తుంది.
ఆ తర్వాత నర్మద వెళ్లి ఒక ఆడపిల్ల గురించి మీరు అలా ఎలా మాట్లాడుతున్నారు.. ప్రేమ మీ మేనకోడలు తనని కోపంలో నువ్వు లేచిపోలేదా మీ వాళ్ళది ఏం పెంపకం అంటున్నారు.. మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అదే మాట ప్రేమ మిమ్మల్ని అంటే పరిస్థితి ఏంటి.. అలా తొందరపడకుండా ఉండండి అని వేదవతితో నర్మద అంటుంది.
ఆ తర్వాత ప్రేమ దగ్గరికి నర్మద రాగానే తనని హగ్ చేసుకొని ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |